ఓటిటి అయ్యింది.. నెక్స్ట్ ప్రీమియర్ కి రెడీ అయ్యిన మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్టు బొమ్మ

Mana Shankara Vara Prasad Garu

ఈ ఏడాదిలో సంక్రాంతి కానుకగా వచ్చి దుమ్ము లేపే వసూళ్లతో రికార్డులు సెట్ చేసిన సినిమానే మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు”(Mana Shankara Vara Prasad Garu). దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 375 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము లేపి ఇన్నేళ్ల సినీ చరిత్రలో సంక్రాంతికి ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఇక థియేటర్స్ రన్ తర్వాత ఓటిటిలో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా అక్కడ కూడా రికార్డు రెస్పాన్స్ కొల్లగొట్టింది. ఇలా ఓటిటిలోనీ హవా కనబరుస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ప్రీమియర్ కి సిద్ధం అయ్యింది. అదే టెలివిజన్ ప్రీమియర్. ఈ సినిమా ఓటిటి శాటిలైట్ హక్కులు జీ సంస్థ వారే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇంకా డేట్ ని అనౌన్స్ చేయలేదు కానీ బుల్లితెరపై మన శంకర వరప్రసాద్ గారు రాబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక అక్కడ ఈ సినిమా ఎలాంటి టీఆర్పీ రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాలో వెంకీ మామ కీలక క్యామియోలో నటించగా నయనతార హీరోయిన్ గా నటించారు. అలాగే భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్ వారు, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version