
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. సెన్సేషనల్ హిట్ అఖండ కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గట్టి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కాబోతుంది. ఇక లేటెస్ట్ గానే ఏపీలో రిలీజ్ కి ముందు రోజు రాత్రి నుంచే పైడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.
ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయగా వీటికి సెన్సేషనల్ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది. దాదాపు హౌస్ ఫుల్స్ ఎక్కడపడితే అక్కడ పడుతున్నాయి. దీనితో ఏపీలో మాత్రం అఖండ 2 గట్టి డిమాండ్ నే కనిపిస్తుంది అని చెప్పాలి. అలాగే ఈ ప్రీమియర్స్ కి మంచి ఓపెనింగ్స్ పడతాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ డిసెంబర్ 5న గ్రాండ్ గా సినిమా రాబోతుంది.