‘స్పిరిట్’కి బ్రేకిచ్చిన రాజాసాబ్.. కారణమిదే!

The-Raja-Saab
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో లాంగ్ అవైటెడ్ గా ఉన్న చిత్రం “స్పిరిట్” కూడా ఒకటి. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా షూటింగ్ మొదలు పెట్టుకోగా ఈ కొంతలోనే రాజాసాబ్ సినిమాకి బ్రేక్ ఇచ్చాడట. అయితే ఈ అంతటికి కారణం తన లాస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం కల్కి 2898 ఎడి.

మరి ఈ సినిమా రిలీజ్ సమయంలో ప్రభాస్ మిస్ అయ్యాడు. దీనితో నెక్స్ట్ టైం వస్తానని చెప్పాడు. ఇక ఇపుడు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కోసం అక్కడ స్పెషల్ ప్రీమియర్స్ కోసం పయనమయ్యాడు. బాహుబలి ది ఎపిక్ అక్కడ రిలీజ్ కాబోతుండగా అక్కడి ఆడియెన్స్ కి ఇచ్చిన మాట ప్రకారం వెళుతున్నాడు. దీనితో ఆ సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ పయనమైనట్టు తెలుస్తుంది. అక్కడ బాహుబలి ది ఎపిక్ సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దీని తర్వాత మళ్ళీ మిగతా సినిమాల షూట్ లో ప్రభాస్ పాల్గొననున్నాడు.

Exit mobile version