‘జిస్మత్ మండీ’ రెండో శాఖను ప్రారంభించిన నటుడు ధర్మ మహేష్

d

సినీ నటుడు, వ్యాపారవేత్త ధర్మ మహేష్ ఆధ్వర్యంలోని ‘జిస్మత్ మండీ’ (Jismat Mandi) తమ రెండవ బ్రాంచ్‌ను చైతన్యపురిలో ఘనంగా ప్రారంభించింది. భోజన ప్రియులకు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన రుచికరమైన వంటకాలను అందించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ధర్మ మహేష్ తెలిపారు.

గతంలో ‘గిస్మత్’ (Gismat)గా ఉన్న తమ బ్రాండ్‌ను, తన కుమారుడు జగద్వాజపై ఉన్న ప్రేమతో ‘జిస్మత్’గా రీబ్రాండింగ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మార్పు కేవలం పేరుకే పరిమితం కాదని, ఇది నాణ్యత, భావోద్వేగం మరియు వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. కంపెనీ పూర్తి యాజమాన్యాన్ని తన కుమారుడికి అంకితం చేస్తున్నట్లు, ఈ బాధ్యతల బదిలీ పూర్తయ్యే వరకు నిర్వహణ, విస్తరణ పనులను తానే పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు.

తమ వద్ద లభించే ప్రతి బిర్యానీ ప్లేట్, అతిథుల సంతృప్తి తమకు ముఖ్యమని ధర్మ మహేష్ అన్నారు. ఈ కొత్త గుర్తింపుతో నాణ్యత, ఆప్యాయతలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, భవిష్యత్తులో బ్రాండ్‌ను మరింత విస్తరిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version