రాజమౌళికి ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న.. జపాన్లో ప్రభాస్ క్రేజ్ అలాంటిది మరి

Prabhas

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తన సినిమాలతో తాను గ్లోబల్ దర్శకుడు అవ్వడమే కాకుండా తన హీరోలని కూడా గ్లోబల్ లెవెల్ కి తాను తీసుకెళ్లారు. మరి వీరిలో డార్లింగ్ హీరో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ కి జపాన్ దేశంలో బాహుబలి సిరీస్ లో ఎనలేని ప్రేమ సొంతం అయ్యింది. అక్కడ నుంచి తన సినిమాలకి డిమాండ్ కానీ ప్రభాస్ అంటే క్రేజ్ అలా పెరుగుతూ వచ్చాయి.

ఇక లేటెస్ట్ గా ప్రభాస్ నటించిన బాహుబలి రెండు సినిమాలు కలిపి అక్కడ బాహుబలి ది ఎపిక్ గా విడుదల అయ్యిన నేపథ్యంలో ప్రభాస్ ఇంకా నిర్మాత శోభు యార్లగడ్డ స్పెషల్ ప్రీమియర్స్ కి హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభాస్ రాజమౌళి పంపిన ఓ లేఖని పంచుకున్నాడు. ఇందులో జక్కన్న ప్రభాస్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ అంశం చెప్పడం జరిగింది.

తాను నాలుగు సార్లు జపాన్ వెళ్లి ఉంటానని వెళ్లిన ప్రతీ సారి ఎదురైన ప్రశ్న ఏదన్నా ఉంది అంటే అక్కడి ఆడియెన్స్ ప్రభాస్ ఎప్పుడు ఇక్కడికి వస్తున్నాడు? అని అడుగుతూ ఉంటారని తెలిపారు. మొత్తానికి నా బాహుబలి తన రెండో ఇంటికి చేరుకున్నాడు. ఈ విజిట్ ని కూడా నువ్ ఎంజాయ్ చేస్తున్నావని అనుకుంటున్నాను అని రాజమౌళి తెలిపారు.

దీనితో ప్రభాస్ కూడా అంతే ఆనందంగా ఈ పోస్ట్ ని షేర్ చేసి ఈసారి మనిద్దరం కలిసి జపాన్ వద్దాం అంటూ పోస్ట్ చేసాడు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సో జపాన్ ఆడియెన్స్ లో ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version