‘త్రిముఖా’ నుంచి “గిప్పా గిప్పా” సాంగ్ రిలీజ్.. జనవరి 2న సినిమా విడుదల

Sunny Leone's Trimukha

సన్నీ లియోన్, యోగేష్, సహితి దాసరి, అకృతి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘త్రిముఖా’ (Trimukha) చిత్రం నుంచి హుషారైన పాట “గిప్పా గిప్పా” విడుదలైంది. నూతన సంవత్సర వేడుకలకు జోష్ నింపేలా ఉన్న ఈ పాట, విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

పాటకు వస్తున్న అద్భుతమైన స్పందన పట్ల నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు. సన్నీ లియోన్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ ఈ పాట విజయంతో మరోసారి రుజువైందని, ప్రేక్షకులు ఈ గీతాన్ని రిపీట్ మోడ్‌లో ఆస్వాదిస్తున్నారని వారు తెలిపారు. ఈ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయని చిత్రబృందం పేర్కొంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ‘త్రిముఖా’ చిత్రాన్ని జనవరి 2, 2026న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

Click here for Song

Exit mobile version