చైతు ల్యాండ్‌మార్క్ మూవీకి ఆ డైరెక్టర్.. వర్కవుట్ అయ్యేనా..?

naga chaitanya

అక్కినేని హీరో నాగచైతన్య ఈ సంవత్సరం ‘తండేల్’ చిత్రంతో తన కెరీర్‌లో సాలిడ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లతో సత్తా చాటాడు చైతు. ఇక ఆయన ప్రస్తుతం తన కెరీర్‌లోని 24వ చిత్రాన్ని కార్తీక్ దండు డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత చైతు కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా 25వ ప్రాజెక్ట్ రానుంది.

కాగా, ఈ ప్రెస్టీజియస్ 25వ చిత్రానికి సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య తన కెరీర్‌లోని 25వ చిత్రాన్ని బోయపాటి శ్రీను, కొరటాల శివ వంటి డైరెక్టర్‌తో చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. కానీ, దానికి పూర్తి భిన్నంగా చైతు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘బెదురులంక 2012’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు క్లాక్స్ నాగచైతన్యకు ఓ కథను వినిపించారట.

కథ నచ్చడంతో చైతు ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో చైతూ ల్యాండ్ మార్క్ చిత్రాన్ని టాప్ డైరెక్టర్స్‌తో కాకుండా ఇలా ఓ యంగ్ డైరెక్టర్‌తో చేసేందుకు ఆసక్తిని చూపుతుండటంతో అభిమానులు అవాక్కవుతున్నారు. మరి నిజంగానే నాగచైతన్య తన కెరీర్ ల్యాండ్ మార్క్ చిత్రాన్ని ఈ యంగ్ డైరెక్టర్‌తో చేస్తాడా.. లేక వేరొక డైరెక్టర్‌కు ఛాన్స్ ఇస్తాడా..? అనేది వేచి చూడాలి.

Exit mobile version