ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ చిత్రాల్లో ఒకటి “ది రాజా సాబ్” (The Raja Saab). రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో చేసిన ఈ హారర్ ఫాంటసీ సినిమా పట్ల మంచి హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన కొత్త ట్రైలర్ మాత్రం పాన్ ఇండియా లెవెల్ ఆడియెన్స్ లో చర్చకి దారి తీసింది. ఇందులో మరీ ముఖ్యంగా ప్రభాస్ ఎప్పుడూ లేని విధంగా జోకర్ మేకోవర్ లోకి మారడం అసలు పెద్ద సర్ప్రైజింగ్ అంశం. మరి దీని వెనుక ఉన్న అసలు మేటర్ ని మారుతి రివీల్ చేశారు.
ఆ కామెంట్ ని ప్రభాస్ సీరియస్ గా తీసుకున్నారా?
బాలీవుడ్ నటుడు అర్షద్ వర్శి (Arshad Varsi Comments on Prabhas) ప్రభాస్ పై ఆ మధ్య చేసిన కామెంట్ కాంట్రవర్సీకి దారి తీసింది. ప్రభాస్ కల్కి సినిమాలో జోకర్ లా ఉన్నాడంటూ చేసిన కామెంట్స్ వివాదంగా మారగా ఇదే కామెంట్ ని ప్రభాస్ సీరియస్ గా తీసుకొని రాజా సాబ్ (The Raja Saab) లో నిజంగానే అలా చేసి ఊహించని అప్లాజ్ ని తాను అందుకున్నారు. దీనితో ఇదో స్వీట్ రివెంజ్ అని చాలా మంది భావించారు.
The Raja Saab Part 2 – కానీ దీని వెనుక అసలు ట్విస్ట్ చెప్పిన మారుతీ
ప్రభాస్ ఆ కామెంట్ ని ఎంతవరకు సీరియస్ గా తీసుకున్నారు లేదు అనేది పక్కన పెడితే ఈ ఐడియా మాత్రం మారుతిదేనట. పార్ట్ 2 కి లీడ్ గా ఇలా అనుకుంటున్నాను అని ప్రభాస్ తో ఆ గెటప్ కోసం చెప్పగా తాను ఓకే చెప్పేశారని అలా పార్ట్ 2 కి లీడ్ ఇదే రోల్ తో ఉంటుంది అని అసలు ట్విస్ట్ సీక్వెల్ పై రివీల్ చేయడం జరిగింది.
