ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా వెంకీ మామ కీలక పాత్రలో దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు కూడా ఒకటి. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా విషయంలో మొదట్లో అనీల్ రావిపూడి తమిళ్ నుంచి కూడా ఏ దర్శకుడూ చేయని ఫీట్ చేసి చూపించారు.
నయన్ ఎంత పెద్ద సినిమా చేసినప్పటికీ ఆమె ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నది దాదాపు లేదు. అలాంటిది సినిమా స్టార్టింగ్ కి ముందే నయన్ తో ప్రమోషన్ చేసి చూపించాడు అనీల్ రావిపూడి. ఇది చాలా మందికి సర్ప్రైజింగ్ అయితే ఇప్పుడు అలాంటి అనీల్ కే నయన్ షాకిచ్చింది. ఆమెనే స్వయంగా సినిమా ప్రమోషన్స్ కోసం ఇంకా ఏం అడగలేదు నన్ను అంటూ వదిలిన ప్రమోషనల్ వీడియో మరోసారి వైరల్ అవుతుంది. ఇలా ఇద్దరు కలిసి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అంటున్నారు.
