ట్రైలర్ టాక్ : పవర్‌ఫుల్ యాక్షన్‌తో వస్తున్న విజయ్.. పొలిటికల్ పంచులు అదిరాయి..!

Jana Nayakudu

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తన లాస్ట్ చిత్రం ‘జన నాయకుడు’ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. దర్శకుడు హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించగా, తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్‌గా కట్ చేశారు. విజయ్‌లోని అన్ని ఎమోషన్స్ మనకు ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. యాక్షన్‌తో విజయ్ అందించబోయే ట్రీట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో తన విలనిజంతో మరోసారి అదరగొట్టేందుకు రెడీ అయ్యారు బాబీ డియోల్. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కూడా ఉండబోతున్నాయి. టాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్‌గా రాబోతున్న ఈ సినిమాలో శ్రీలీల చేసిన పాత్రను మమితా బైజు చేస్తోంది. ఆమెతో విజయ్ సీన్స్ బాగా పండినట్లు ఈ ట్రైలర్‌లో గ్లింప్స్ ఇచ్చారు.

ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవర్‌ఫుల్ పంచ్ డైలాగులు ఉండబోతున్నాయని ఈ ట్రైలర్‌లో చూపెట్టారు. పొలిటికల్ పంచులతో విజయ్ చేయబోయే పర్ఫార్మెన్స్ అభిమానులకు ట్రీట్ ఇవ్వడం ఖాయం. ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జనవరి 9న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version