మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu). ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ దగ్గరకి వస్తుండగా ఈ సినిమాకి కూడా భారీ టికెట్ ధరలు అలాగే ప్రీమియర్స్ కూడా ఉంటాయని టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా టికెట్ ధరల హైక్స్ అంశంపై బిగ్ రిలీఫ్ దక్కినట్టు తెలుస్తుంది.
No Ticket Rates Hikes – తెలుగు స్టేట్స్ లో నో టికెట్ రేట్స్ హైక్స్?
ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు టికెట్ ధరలు పెంచుకొనే వస్తున్నాయి. కానీ కొన్ని సినిమాల మేకర్స్ మాత్రం హైక్స్ లేకుండానే వస్తున్నారు. మరి ఇదే స్ట్రాటజీతో మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) కూడా వచ్చేస్తున్నారట. తెలుగు స్టేట్స్ లో ఎలాంటి హైక్స్ లేకుండా మేకర్స్ ఈ సినిమాని తెస్తున్నారట. ఇది మాత్రం మంచి విషయమే అని చెప్పాలి.
ఈ ప్లాన్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందా?
ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్క్ అయ్యేందుకు చాలా ఛాన్స్ ఉంది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమానే ఉదాహరణగా తీసుకుంటే సంక్రాంతి బరిలో వచ్చి భారీ వసూళ్లు ఆ సినిమా సాధించింది. కానీ ఏపీలో ఆ సినిమాకి హైక్స్ దక్కాయి. ఇదే కొంచెం ఎఫెక్ట్ చూపించింది. చాలా మంది ఫ్యామిలీ ఆడియెన్స్ ఒక మధ్య తరగతి కుటుంబం మొత్తం సినిమాకి వెళ్ళాలి అంటే ఆలోచించారు కూడా.. కానీ ఇప్పుడు అలాంటిది లేదు కాబట్టి డెఫినెట్ గా సంక్రాంతికి వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి ఈ ప్లాన్ వర్క్ అవుతుంది అనే చెప్పొచ్చు.
