టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి బరిలో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి ట్రైలర్ లాంచ్‌కు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, తొలుత ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 7న లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు.
కానీ, అదే రోజు వరుస మూవీ ఈవెంట్స్ ఉండటంతో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వాయిదా వేశారు. ‘అనగనగా ఒక రాజు’ మూవీ ట్రైలర్‌ను జనవరి 8న ఉదయం 10 గంటల నుంచి శ్రీరాములు థియేటర్లో లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ వాయిదా చాలా మంచిదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను దర్శకుడు మారి డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది. ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
