ట్రైలర్ టాక్: ఫుల్ ఫన్ రైడ్ ని ప్రామిస్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “అనగనగా ఒక రాజు”(Anaganaga Oka Raju). ఈ సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న ఈ సినిమా పట్ల మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మధ్యలో ట్రైలర్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది.

ఇక ఎట్టకేలకి ఈ ట్రైలర్ వచ్చేసింది. మరి ఈ ట్రైలర్ మాత్రం ఫుల్ ఫన్ రైడ్ ని థియేటర్స్ లో ప్రామిస్ చేస్తుంది. నాన్ స్టాప్ పంచులతో నవీన్ పొలిశెట్టి కామెడీ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. అలాగే మీనాక్షి చౌదరి రోల్ కూడా మంచి కామికల్ గా కనిపిస్తుండగా ఇద్దరి మధ్య కంబైన్డ్ కామెడీ సీన్స్ కూడా బాగానే వర్క్ అయ్యేలా అనిపిస్తున్నాయి.

ఇంతేనా ప్రశాంతంగా ఉన్న నాలాంటి వాణ్ణి కూడా ప్రశాంత్ నీల్ లా మార్చారు కదరా అంటూ సాగే డైలాగ్స్ ఇందులో మరింత హైలైట్ గా కనిపిస్తున్నాయి. కింగ్ నాగ్ వాయిస్ ఓవర్ లో నరేషన్ ఇవ్వడం అంతే కాకుండా బుల్లిరాజు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇలా పండగకి మాత్రం మంచి ప్యాకెడ్ ఎంటర్టైనర్ లా ఈ సినిమా కూడా రాబోతుంది అని చెప్పవచ్చు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version