తనపై వస్తున్న వార్తలపై స్పందించిన అవికా గోర్

avika

సోషల్ మీడియాలో తనపై ప్రచారంలో ఉన్న ప్రెగ్నెన్సీ రూమర్స్‌పై నటి అవికా గోర్ ఘాటుగా స్పందించింది. ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ పూర్తిగా తప్పుడు ప్రచారమేనని ఆమె స్పష్టంగా కొట్టిపారేసింది. నిరాధారమైన వార్తలను నమ్మవద్దని అభిమానులను ఆమె కోరింది.

ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ.. “ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ అన్నీ పూర్తిగా ఫేక్. అలాంటిదేమీ లేదు. కానీ ఇంకో వార్త మాత్రం ఉంది. అది ఏంటో త్వరలోనే చెబుతాం” అని చెప్పుకొచ్చింది. దీంతో త్వరలో ఆమె చెప్పబోయే మరో గుడ్ న్యూస్ ఏమిటా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అవికా గోర్ 2025లో తన బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చాంద్వానితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో ఒక స్నేహితుడి పార్టీ సందర్భంగా పరిచయం అయిన వీరు, జూన్ 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల ‘పతి పత్నీ ఔర్ పంగా’ అనే షోలో కలిసి కనిపించిన ఈ జంట, అదే షో సెట్స్‌లోనే పెళ్లి చేసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

Exit mobile version