ట్విస్ట్: ‘తుంబాడ్’ దర్శకుడు నెక్స్ట్ సినిమా డేట్ ఫిక్స్.. మరో క్రేజీ కాన్సెప్ట్!

Tumbbad

ఇండియన్ సినిమా సినిమా దగ్గర ది బెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమాల లిస్ట్ లో నిలిచే చిత్రాల్లో మరాఠీ సినిమా నుంచి వచ్చిన తుంబాడ్ (Tumbbad Movie) చిత్రం డెఫినెట్ గా నిలుస్తుంది. 2018లో వచ్చిననపుడు దీని విలువ జనం తెలుసుకోలేకపోయారు. కానీ తర్వాత ఇది కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. అయితే ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అనీల్ రాహి బర్వె నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుంది అని చాలా మంది ఎదురు చూసారు. అయితే తన నుంచి రక్త బ్రహ్మాండ్ అనే భారీ సిరీస్ అదే కాకుండా తుంబాడ్ కి సీక్వెల్ లు కూడా అనౌన్స్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఇవి కాకుండా మరో సినిమా ఇప్పుడు రిలీజ్ కి ఫిక్స్ అయ్యింది.

Not Tumbbad 2, Rakt Brahmand, Maya Sabha this time – తుంబాడ్ 2, రక్త బ్రహ్మాండ్ కాదు ‘మయసభ’ వస్తుంది..

ఒక ఊహించని హారర్ థ్రిల్లర్ ని అందించిన ఈ టాలెంటెడ్ దర్శకుడు నుంచి అందరికీ నోటెడ్ అనౌన్సమెంట్ లు కాకుండా ఒక కొత్త కంటెంట్ తాలూకా టీజర్ ట్రైలర్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. మయసభ (Maya Sabha Teaser) అంటూ వచ్చిన ఈ సినిమా మళ్ళీ కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈసారి కూడా అనీల్ ఏదో కొట్టగానే ట్రై చేసినట్టు ఇందులో కనిపిస్తుంది.

ఇల్ల్యూషన్ కాన్సెప్ట్..

జావేద్ జాఫేరీ లీడ్ పాత్రలో వీణ, దీపక్ డమాల్ తదితరులు నటించిన ఈ చిత్రం టీజర్ లో విజువల్స్ ఒకింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? అది నవ్వు అంటూ చెప్పి ఒక ఇల్యూషన్ తో కూడిన ప్రపంచాన్ని ఇందులో చూపిస్తున్నారు.

Maya Sabha release date – రిలీజ్ డేట్ ఇదే

ఇక ఈ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చిత్రాన్ని మేకర్స్ హిందీలో ఈ జనవరి 30న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. పాన్ ఇండియా భాషల్లో ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి ఖరారు కాలేదు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version