ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ రికార్డుతో మెగాస్టార్ ర్యాంపేజ్.. బాసా మజాకా..!

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి బరిలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.

ఇక ఈ సినిమాలో చిరు తనదైన కామెడీ టైమింగ్‌తో వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తుకు చేశారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు చిరు చేసే కామెడీని చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త ట్రెండ్ కంటిన్యూ చూస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఇప్పటికే ఏకంగా 3 మిలియన్‌కు పైగా టికెట్ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

దీంతో ఓ రీజనల్ సినిమా ఇంత త్వరగా 3 మిలియన్ మార్క్‌ను అందుకోవడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్‌లో చేశారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version