మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్‌తో ఇరగదీశాడు.
ఇక ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేస్తూ లోకల్‌తో పాటు ఇంటర్నేషనల్‌గా కూడా సౌండ్ చేస్తోంది. హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో ఈ చిత్రం ఇప్పటికే రూ.1 కోటికి పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిందని సదరు థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. అటు అమెరికాలోనూ ఈ సినిమా దూకుడు మామూలుగా లేదు.
ఈ చిత్రం నార్త్ అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 3 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో చిరంజీవి కెరీర్‌లో యూఎస్‌లో ఇది ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమాతో మెగాస్టార్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
