RT 77: ‘ఖుషి’ దర్శకునితో మాస్ మహారాజ్ కొత్త ప్రాజెక్ట్.. ఫస్ట్ లుక్ కి టైం ఫిక్స్

RT77

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల సంక్రాంతి కానుకగా వచ్చి పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు అనౌన్స్ అయ్యిపోయింది. ఈ చిత్రాన్ని మజిలీ, ఖుషి దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేయబడింది.

అయితే ఈ సినిమా ఒక హారర్ బ్యాక్ డ్రాప్ లో అన్నట్టు కూడా టాక్ ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా జీవి ప్రకాష్ ని సంగీతం కోసం తీసుకోవడం విశేషం. అలాగే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కి కూడా మేకర్స్ డేట్ అండ్ టైం ని ఫిక్స్ చేసేసారు. ఈ జనవరి 26 రవితేజ పుట్టినరోజు కానుకగా ఉదయం 10 గంటలకి తన కెరీర్ 77వ సినిమా (RT 77) ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేస్తున్నట్టు ఖరారు చేశారు. మరి దీనితో రేపు మరింత క్లారిటీ వస్తుంది.

Exit mobile version