టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’(Varanasi) కోసం యావత్ సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలవ్వడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కేవల అనౌన్స్‌మెంట్ వీడియోతో ఈ సినిమా క్రియేట్ చేసిన హైప్ మామూలుది కాదు.
ఇక తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో పలు హోర్డింగులు వెలిశాయి. వాటిపై ‘2027 ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజ్’ అని రాసి ఉంది. దీంతో ఇది వారణాసి మూవీ రిలీజ్ డేట్ అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఈ వార్తతో మహేష్ బాబు అభిమానుల్లో సంతోషం నెలకొంది. అంతేగాక, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ వార్తతో హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం స్పిరిట్ చిత్రం అని తెలుస్తోంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్న ‘స్పిరిట్’ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ పవర్‌ఫుల్ కాప్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2027 మార్చి 5న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడకుండా నెల రోజుల గ్యాప్‌తో వస్తున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు కూడా కలెక్షన్స్ పరంగా సాలిడ్ రన్ కంటిన్యూ చేస్తాయని ఇద్దరు హీరోల అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి వారణాసి రిలీజ్ డేట్ పై సాగుతున్న చర్చ ప్రేక్షకుల్లో మరోసారి అంచనాలు పెంచేసింది.
