ఈ మార్చ్ లో భారీ రిలీజ్ కి వస్తున్న అవైటెడ్ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ చిత్రం ‘టాక్సిక్’ (Toxic) కూడా ఒకటి. ధురంధర్ 2 తో క్లాష్ లో ఉన్న ఈ సినిమా తెలుగు రిలీజ్ పై ఇప్పుడు సాలిడ్ అప్డేట్ వచ్చింది. దీనితో ఈ చిత్రాన్ని మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు టాప్ నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ముందుకు వచ్చారు.
తమ ఎస్ వి సి రిలీజ్ పై ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లుగా కన్ఫర్మ్ చేసారు. సో ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్క్రీన్ రిలీజ్ దక్కుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో కియార అద్వానీ, నయనతార, హుమా ఖురేషి తదితరులు నటించగా రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే కె వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాని మేకర్స్ పాన్ ఇండియా భాషలోనే కాకుండా ఇంగ్లీష్ లో కూడా విడుదల కానుంది.
The chaos is beginning to unfold.
Toxic: A Fairy Tale for Grown-ups arrives in theaters across Andhra Pradesh and Telangana through @SVCRelease
Intoxicating the world from 19-03-2026.#DaddyIsHome #ToxicTheMovie#TOXIConMarch19th @TheNameIsYash#Nayanthara@humasqureshi… pic.twitter.com/1uB4RbQ9sg
— KVN Productions (@KvnProductions) February 6, 2026
