‘రామాయణ’లో వర్సటైల్ యాక్టర్.. ఆ పాత్రలో కనిపిస్తాడా..?

Ramayana

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సౌత్ బ్యూటీ సాయి పల్లవి కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రామాయణ’ ( Ramayana )కోసం యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. దర్శకుడు నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథలాజికల్ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. ఇప్పటికే ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో రావణుడు పాత్రలో కన్నడ స్టార్ యశ్ నటిస్తున్నాడు. అయితే, రామాయణంలో మరో కీలక పాత్ర అయిన విభీషణుడిగా వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి అయితే పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారట.

దీంతో విజయ్ సేతుపతిని ఒప్పించేందుకు ‘రామాయణ’ చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. మరి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో విజయ్ సేతుపతి నటిస్తాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version