‘విశ్వంభర’ నెక్స్ట్ ట్రీట్ పై లేటెస్ట్ బజ్!

Vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు తో రీజనల్ రికార్డులు తిరగరాసి మెగాస్టార్ తనకి తానే సాటి అని మరోసారి ప్రూవ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత రాబోతున్న అవైటెడ్ సినిమానే విశ్వంభర. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ గ్రాండ్ ఫాంటసీ సినిమా కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఇదే ముందు రావాల్సిన సినిమా అయినప్పటికీ ఇంకా రాలేదు.

ఇక ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ మాత్రం ఫ్యాన్స్ ని అలరించాయి. ఇలా ఫైనల్ గా నెక్స్ట్ ట్రీట్ కి రంగం సిద్ధం అయ్యింది అని తెలుస్తోంది. ఈ మహాశివరాత్రి కానుకగా ఓ సరికొత్త వీడియో కంటెంట్ బయటకి వచ్చే అవకాశం ఉన్నట్టు లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా కీరవాణి సంగీతం అందించారు అలాగే యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version