బ్యాటిల్ ఈజ్ ఆన్.. ‘ధురంధర్ 2’ రూమర్స్ కి చెక్, రిలీజ్ ఆగేది లేదు!

Dhurandhar-and-Toxic

ఈ రానున్న మార్చ్ నెలలో రాబోతున్న భారీ చిత్రాల్లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన చిత్రం ‘టాక్సిక్'(Toxic) అలాగే బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రం “ధురంధర్ 2″(Dhurandhar 2) ల విడుదల కోసమే పాన్ ఇండియా ఆడియెన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాల్లో ధురంధర్ 2 వాయిదా పడుతుంది అంటూ పలు రూమర్స్ ఆ మధ్య వినిపించాయి.

పైగా టాక్సిక్ మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా ఎప్పటికప్పుడు కంటెంట్ తో సినిమా రిలీజ్ పై అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇక ధురంధర్ యూనిట్ మాత్రం అరకొర అప్డేట్స్ తోనే సరిపెడుతూ రావడం పైపెచ్చు రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్న సమయంలోనే మౌనంగా ఉండడం వాయిదాపై మరింత బలాన్ని చేకూర్చింది. ఇక లేటెస్ట్ గా టాక్సిక్ టీజర్ కూడా వచ్చింది.

మరి ఈ సమయంలో ఫైనల్ గా ధురంధర్ 2 యూనిట్ ఆన్లైన్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. వాయిదా రూమర్స్ కి చెక్ పెడుతూ ధురంధర్ 2 ఆన్ టైం అంటే మార్చ్ 19నే థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నట్టుగా ఖరారు చేశారు. సో టాక్సిక్ తో బ్యాటిల్ ఆన్ లోనే ఉందని చెప్పొచ్చు. సో మూవీ లవర్స్ లో ఈ సినిమాల క్లాష్ మరింత రసవత్తర వాతావరణం సెట్ చేసింది. మరి వీటిలో ఏది విన్నర్ అవుతుందో చూడాలి.

Exit mobile version