నేడు నాచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా నానికి తమ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. అయితే నాని నుంచి వస్తున్న సినిమాలలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న సాలిడ్ సినిమానే “బ్లడీ రోమియో”.
అప్పుడు అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమా ఫైనల్ గా ఓ టైటిల్ ని ఇప్పుడు తెచ్చుకోగా దీనిపై వచ్చిన క్రేజీ కామికల్ టీజర్ వీడియో మ్యాడ్ స్టఫ్ తో ఉంది. ఒక చెఫ్ అండ్ గ్యాంగ్ స్టర్ గా నాని ఇందులో కనిపిస్తుండగా సుజీత్ మ్యూజిక్ టేస్ట్ మరోసారి ఇందులో తెలుస్తోంది. సో మొత్తానికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బ్లడీ రోమియో కం గ్యాంగ్ స్టర్ గా నాని అలరించనున్నాడు. అలాగే ఈ సినిమా గ్యాంగ్స్టా సాంగ్ ని ప్రవీణ్ వెయ్రా స్కోర్ అందించగా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
