వైరల్: ‘వారణాసి’ పై కీలక విషయాలు రివీల్ చేసిన ప్రియాంక చోప్రా!

Priyanka-Varanasi

ఇప్పుడు ప్రపంచ ఆడియెన్స్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “వారణాసి” కోసమే అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా నటిస్తుండగా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఆల్రెడీ హాలీవుడ్ లెవెల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక లేటెస్ట్ గా నటి ప్రియాంక చోప్రా ఈ సినిమా విషయంలో కొన్ని కీలక విషయాలు రివీల్ చేయడం వైరల్ గా మారింది.

ఆమె హాలీవుడ్ చిత్రం “ది బ్లఫ్” (The Bluff) రిలీజ్ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ వారణాసి చిత్రం ఒక అమేజింగ్ జర్నీ అని అందులో టైం ట్రావెల్ చేస్తాం, ప్రపంచం అంతా తిరుగుతాం ఒక అడ్వెంచరస్ జర్నీ అని ఆమె తెలిపింది. దీనితో ఈ సినిమా కాన్సెప్ట్ పై మరింత క్లారిటీ అందరికి వచ్చింది అనుకోవచ్చు.

అంతే కాకుండా ఈ సినిమాకి ఏకంగా 14 నెలలు పాటు షూటింగ్ చేసామని ఇంకా ఐదారు నెలలు చేయాల్సి ఉందని ఆమె తెలిపింది. రాజమౌళి కొంచెం టైం తీసుకుంటారని అందుకే ఇంత కాలం షూట్ చేస్తున్నట్టు ఆమె తెలిపింది. దీనితో తన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Exit mobile version