నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘హనీ’ ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలో విడుదలైంది. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ, ఇప్పుడు డిజిటల్ వేదికలపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.
విశేషమేమిటంటే, ‘హనీ’ చిత్రం ఒకేసారి రెండు ఓటీటీ ప్లాట్ఫార్మ్ లలో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐదు భారతీయ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా, సన్ నెక్స్ట్ లో మాత్రం కేవలం తెలుగు మరియు తమిళ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. థియేటర్లలో కేవలం తెలుగులో మాత్రమే విడుదలైన ఈ చిత్రం, ఓటీటీ పుణ్యమా అని ఇప్పుడు పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం దక్కించుకుంది.
దివ్య పిళ్లై, దివి, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ‘ఓవా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై రవి పీట్ల నిర్మించారు. అజయ్ అరసాడ సంగీతం అందించిన ఈ థ్రిల్లర్, ఇంటి వద్ద చూసే ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
