తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ కాంట్రోవర్సీ చిత్రం ‘హాట్ స్పాట్ 2 మచ్’.. ఎందులో అంటే..?

Hot Spot 2

తమిళంలో తెరకెక్కిన వివాదాస్పద ఆంథాలజీ మూవీ ‘హాట్ స్పాట్ 2 మచ్’ ఇప్పుడు తెలుగులోకి వచ్చేసింది. థియేటర్లలో కేవలం తమిళంలోనే విడుదలైన ఈ చిత్రం, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై క్రమంగా ఇతర భాషల్లో అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే హిందీలో అలరించిన ఈ సినిమా, నేటి నుండి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది.

దర్శకుడు విఘ్నేష్ కార్తీక్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కీలక పాత్ర పోషించింది. సమాజంలోని సున్నితమైన అంశాలను, కాస్త వివాదాస్పదమైన రీతిలో చర్చించిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ సమయంలో మిక్సిడ్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఓటీటీలో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఎం.ఎస్. భాస్కర్, తంబి రామయ్య, భవాని శ్రీ, బ్రిగిడా సాగా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సతీష్ రఘునాథన్ సంగీతం అందించారు. కె.జె.బాలమణిమార్బన్ మరియు అనీల్ కె.రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version