జీరో కట్స్ తో ‘ఉస్తాద్’ సెన్సార్ పూర్తి.. ఇక ఊచకోతే!

Ustaad Bhagat Singh 2

ఈ ఉగాది కానుకగా ఆడియెన్స్ ని అలరించడానికి వస్తున్న టాలీవుడ్ పెద్ద సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా మరియు శ్రీలీల కలయికలో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ మాస్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా పనులు అన్నీ ఇప్పుడు శరవేగంగా పూర్తి అవుతుండగా మేకర్స్ అపుడే సెన్సార్ పనులు కూడా ముగించేశారు. పవన్ రీసెంట్ గానే డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసి సినిమాని సెన్సార్ కి పంపించగా సెన్సార్ వారు జీరో కట్స్ అందివ్వడం విశేషం. అలాగే యూ/ఏ సర్టిఫికేషన్ తో ఈ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుంది.

గతంలో ఓజి కి వచ్చిన ఏ సర్టిఫికెట్ తో వసూళ్ల పై కొంచెం ప్రభావం పడింది. ఇప్పుడు దీనికేం లేవు కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఓపెనింగ్స్ సెట్ చేస్తాడో చూడాల్సిందే. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు వర్క్ చేస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ మార్చ్ 19న ఘనంగా విడుదలకి తీసుకొస్తున్నారు.

Exit mobile version