ఇప్పుడు ఒక్క బాలీవుడ్ సినిమానే కాకుండా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసుకున్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “ధురంధర్ 2” అనే చెప్పాలి. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఆడియెన్స్ లో మంచి ఉత్సుకతని రేకెత్తిస్తుంది.
ఆల్రెడీ ప్రీమియర్స్ కి టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడుపోతుండగా హిందీ సహా దక్షిణాది మార్కెట్ లో చాలా కాలం తర్వాత మంచి ముద్ర వేసుకున్న హిందీ సినిమాగా ఇది నిలిచింది. ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ధురంధర్ 2 నే ఇప్పుడు దిక్కుగా మారినట్టు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తమిళ్, మలయాళ ఇండస్ట్రీ లలో కూడా ధురంధర్ 2 పెర్ఫామెన్స్ పైనే థియేటర్స్ చాలావరకు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా పట్ల ఉన్న హైప్ ప్రస్తుతం ఉన్న బుకింగ్స్ తో చూస్తే మంచి లాంగ్ రన్ తో గత కొన్నాళ్ల నుంచి సరిగ్గా సినిమాలు లేక వెలవెలబోతున్న థియేటర్స్ ని కొంచెం బిజీగా ఈ సినిమా మారుస్తుందని భావిస్తున్నారట.
అయితే సౌత్ లో మిగతా స్టేట్స్ ఏమో కానీ మన ఏపీ, తెలంగాణలో మాత్రం ఉస్తాద్ రూల్ ఉంటుంది. పవన్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే రోజున వస్తుంది కాబట్టి డే 1, ఓపెనింగ్స్ పరంగా ఈ రెండు స్టేట్స్ లో మాత్రం ఉస్తాద్ డామినేషన్ ఉంటుంది. తర్వాత టాక్ ని బట్టి జెనరల్ ఆడియెన్స్ ఏ సినిమా విజేత అనేది నిర్ణయిస్తారు.
