- సల్మాన్ ఖాన్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్‌ను మేకర్స్ ‘మాతృభూమి’గా మార్చారు.
- ముళ్లకంచె చుట్టిన ఆయుధంతో, రక్తపు గాయాలతో ఉన్న సల్మాన్ ఇంటెన్స్ అండ్ ఫెరోషియస్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది.
- ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు తగ్గట్టుగా ‘మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో హీరో సల్మాన్ ఖాన్ అదిరిపోయే మెసేజ్ ఇచ్చారు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్‌కు ఓ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. భారీ అంచనాలున్న తన రాబోయే వార్ డ్రామా సినిమా టైటిల్‌ను మేకర్స్ అనూహ్యంగా మార్చేశారు. మొదట ఈ చిత్రానికి ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడు దానిని ‘మాతృభూమి’ (Maatrubhumi) గా మారుస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు. కేవలం టైటిల్ మార్చడమే కాదు.. అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే రేంజ్‌లో ఓ ఇంటెన్స్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఈ తాజా పోస్టర్‌లో సల్మాన్ ఖాన్ ఉగ్రరూపం హైలైట్‌గా నిలిచింది. ముఖం నిండా రక్తపు గాయాలు, కోపంతో రగిలిపోతున్న కళ్లు, చేతిలో ముళ్లకంచె చుట్టిన ఆయుధంతో ఆయన లుక్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. సల్మాన్ పంచుకున్న ఈ పోస్టర్ ఓ బలమైన సందేశాన్ని ఇస్తోంది. “మే వార్ రెస్ట్ ఇన్ పీస్” (May War Rest In Peace) అనే ట్యాగ్‌లైన్ అందరినీ ఆలోచింపజేస్తోంది. కరెక్ట్ టైమ్‌కి కరెక్ట్ మెసేజ్ ఇచ్చారంటూ నెటిజన్లు సల్మాన్‌ను ప్రశంసిస్తున్నారు.
అపూర్వ లాఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ దేశభక్తి చిత్రాన్ని సల్మా ఖాన్ నిర్మిస్తున్నారు. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఓ పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. సరికొత్త టైటిల్, ఈ రా అండ్ రస్టిక్ లుక్ చూశాక, సిల్వర్ స్క్రీన్‌పై భాయ్‌జాన్ యాక్షన్ విధ్వంసం ఏ రేంజ్‌లో ఉండబోతోందో ఇట్టే అర్థమవుతోంది.
