ధురంధర్ 2 ప్రీమియర్స్.. చివరి నిమిషంలో ఆగిన షోస్..!

Dhurandhar

​ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ధురంధర్ 2’ విడుదలకు ముందే అనూహ్య సమస్యలను ఎదుర్కొంటోంది. నేడు సాయంత్రం నుండే పెయిడ్ ప్రీమియర్ షోలు ఉంటాయని మేకర్స్ ఘనంగా ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కంటెంట్ డెలివరీలో జాప్యం జరిగిందని, దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలు రద్దు కావడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

​కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాకుండా, హైదరాబాద్ రీజియన్‌లో హిందీ ప్రీమియర్లకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులకు కూడా చివరి నిమిషంలో క్యాన్సిలేషన్ మెసేజ్‌లు వస్తుండటం గమనార్హం. సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, ఎంతో ఆశగా ఎదురుచూసిన సినీ విశ్లేషకులు కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా కొన్ని చోట్ల ఒరిజినల్ హిందీ వెర్షన్ షోలు కూడా సాంకేతిక కారణాల వల్ల రద్దు కావడంతో మేకర్స్ తీరుపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
​దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా లేదా అన్నది ప్రస్తుతం సందిగ్ధంగా మారింది.

గ్లోబల్ రిలీజ్‌కు ముందే ఇలాంటి గందరగోళం తలెత్తడం సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు (మార్చి 19) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Exit mobile version