‘ఆదర్శకుటుంబం’లో స్పెషల్ ఎపిసోడ్ ?

Adarsha-Kutumbham

విక్టరీ వెంకటేశ్‌ హీరోగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శకుటుంబం’ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ‘వెంకీ’ పై ఓ కామెడీ ఎపిసోడ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఈ ఎపిసోడ్ సినిమా మొత్తానికే స్పెషల్ కామెడీ ఎపిసోడ్ లా ఉంటుందట. త్రివిక్రమ్ మార్క్ పంచ్ లు ఈ ఎపిసోడ్ లో ఫుల్ గా ఉంటాయట.

ఇక నాణ్యత విషయంలో త్రివిక్రమ్ ఎక్కడా రాజీ పడటం లేదు. అనుకున్న సమయానికే సినిమాను పూర్తి చేసి వేసవి వినోదాన్ని అందించాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అన్నట్టు త్రివిక్రమ్‌, వెంకటేశ్ నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ తదితర చిత్రాలకు రచయితగా పని చేశారు. ఈ కాంబినేషన్‌లో మూవీని ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా నిర్మాణ సంస్థ హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Exit mobile version