సోలోగా ఉండటం బెటర్ అంటున్న ఎనర్జిటిక్ హీరో రామ్

Ram-Pothuneni

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన సింగిల్ స్టేటస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఒంటరిగా గడపడం చిన్నప్పటి నుంచే అలవాటని, ఆ ఏకాంతం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆయన స్పష్టం చేశాడు.

​సినిమా షూటింగ్స్‌లో వందలాది మంది మధ్య ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నానని రామ్ తెలిపాడు. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఏడాదిన్నర పాటు ఒంటరిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు.

​భవిష్యత్తులో ఎవరైనా తన జీవితంలోకి వస్తే ఆహ్వానిస్తానని, ఒకవేళ ఎవరూ రాకపోయినా ఒంటరిగానే మరింత సంతోషంగా ఉంటానని రామ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Exit mobile version