వరల్డ్ వైడ్ ‘ధురంధర్ 2’ 32 రోజుల రికార్డు వసూళ్ళు ఎంతంటే!

Dhurandhar-2

బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన సాలిడ్ స్పై యాక్షన్ చిత్రం “ధురంధర్ 2”. భారీ అంచనాలు నడుమ వచ్చి ఈ సినిమా వాటిని అందుకొని రికార్డు రన్ ని బాక్సాఫీస్ దగ్గర రాబట్టింది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 32 రోజుల సాలిడ్ రన్ ని పూర్తి చేసుకొని ఇంకా స్టడీగా దూసుకెళ్తుంది. అయితే ఈ 32 రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ ఇంకా ఓవరాల్ గా చూసినట్టు అయితే..

ఇండియా వైడ్ గా మొత్తం 32 రోజుల్లో 1,360 కోట్ల గ్రాస్ ని రాబట్టగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మాత్రం మొత్తం 423 కోట్ల గ్రాస్ ని ఈ 32 రోజుల్లో కొల్లగొట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1,783 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా నెక్స్ట్ స్టాప్ గా 1800 కోట్లు దగ్గరకి వెళ్లబోతుంది. సో ఇలా లాంగ్ రన్ ఇంతే స్టడీగా కొనసాగితే 1850 కోట్ల వరకు వెళ్లే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా. సో ఈ బిగ్గెస్ట్ హిట్ సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version