ఫోటో మూమెంట్ : సీఎం రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన బెల్లంకొండ శ్రీనివాస్

Bellamkonda-Sreenivas

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 29న జరగనున్న తన వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను పలువురు సెలబ్రిటీలకు పంచుతూ ఈ హీరో అండ్ ఫ్యామిలీ బిజీగా ఉన్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ శ్రీనివాస్ పెళ్లికి ఆయన్ను ఆహ్వానించారు.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు బెల్లంకొండ ఫ్యామిలీ. శ్రీనివాస్ వివాహ వేడుకకు రావాల్సిందిగా ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పెళ్లి కుమారుడికి మరియు ఆయన కుటుంబానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.

‘శ్రీనివాస కావ్యాణం’ పేరుతో జరుగుతున్న ఈ వివాహ మహోత్సవం ఈ నెల ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుండి ప్రముఖులు హాజరు కానున్నారు.

Exit mobile version