సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రణబాలి, రౌడీ జనార్ధన అనే రెండు గ్రాండ్ స్కేల్ సినిమాలు తన నుంచి రానున్నాయి. అయితే ఈ సినిమాల తర్వాత హాయ్ నాన్న దర్శకుడు శౌర్యువ్ తో కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఏకంగా వారు హాలీవుడ్ బృందంతో కలిసి పని చేస్తుండడం సినిమాకి మరింత వెయిట్ ని తీసుకొచ్చేలా చేసింది.
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం దర్శకుడు ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్ ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సహా తెలుగులో కూడా పలు సినిమాలు చేసిన బ్యూటీ కృతి సనన్ ఈ సినిమాలో విజయ్ సరసన ఫిక్స్ అయినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కూడా హీశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం అందిస్తున్నారు.
