కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ తెలుగు చిత్రమే జై హనుమాన్. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ భారీ డివోషనల్ చిత్రం కోసం ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జస్ట్ ఈ కొన్ని రోజులు నుంచే మొదలు కాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ దీనిపై వినిపిస్తుంది. దీని ప్రకారం సెన్సేషనల్ హిట్ ధురంధర్ సినిమా పవర్ఫుల్ నటుడు అక్షయే ఖన్నా కూడా ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తుంది.
ధురంధర్ 1 లో అక్షయేకి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే. మరి అలాంటి నటుడు జై హనుమాన్ లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో భాగం కావడం అనేది సినిమాకి మరింత వెయిట్ అందిస్తుంది అని చెప్పవచ్చు. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ప్రశాంత్ వర్మ సెట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ “మహాకాళీ” లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలా లింక్ తో జై హనుమాన్ లో కూడా తాను ఎంటర్ కావచ్చు.మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
