ముఖ్యమంత్రిగా విజయ్‌.. ప్రత్యేక ఆకర్షణగా త్రిష !

Thalapathy-Vijay

తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్‌ విజయ్‌ ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి సవాల్ విసురుతూ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని స్థాపించి, గెలిచి నేడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు చెన్నైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇండోర్‌ స్టేడియం వేదికైంది. విజయ్ తో గవర్నర్ ఆర్లేకర్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ, సినీరంగ ప్రముఖులు హాజరయ్యారు. నటి త్రిష వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.

విజయ్‌ తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఎన్. ఆనంద్, ఆదవ అర్జున, కె.ఎ. సెంగోటియన్, ఎస్‌ కీర్తన, కె.జి. అరుణ్‌ రాజ్, పి. వెంకటరమణన్, సి.ఆర్‌. నిర్మల్ కుమార్, రాజ్‌మోహన్, టి.కె. ప్రభు ఉన్నారు. కార్యక్రమానికి భాజపా నేతలు నైనార్ నాగేంద్రన్, కె.అన్నామలై హాజరు అయ్యారు. మరి విజయ్, తమిళ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాలి.

Exit mobile version