కోలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాట చరిత్ర సృష్టించి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యిన సంగతి తెలిసిందే. పార్టీ పెట్టిన కొన్నాళ్ల లోనే తాను అక్కడ చక్రం తిప్పి సీఎం అయ్యారు. అయితే కొంతమంది స్పెషల్ వ్యక్తుల జీవితాల్లో కొన్ని మొట్టమొదటి మూమెంట్స్ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
అలా తనకి ఎంతో బాధ్యతతో కూడిన సీఎం కుర్చిలో విజయ్ ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సారి కూర్చునే దృశ్యాలు అభిమానులు ఎంత ప్రత్యేకం అనేది చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ స్పెషల్ మూమెంట్ ఇప్పుడు అభిమానులని మరింత ఉద్వేగపరిచింది.
సోషల్ మీడియాలో విజయ్ మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి కుర్చీలో చేరడం దాని తాలూకా విజువల్స్ ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మన తెలుగు నుంచి పలువురు స్టార్స్ సహా దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు విజయ్ కి తమ బెస్ట్ విషెస్ ని నేడు అందించారు.
முதலமைச்சர் நாற்காலியில் அமர்ந்தார்!! 😭❤️🔥 #CMJosephVijay | @TVKVijayHQ https://t.co/g6Tje9nfRf pic.twitter.com/By5t7odTEf
— Prakash Vijay (@PrakazVijay_Of) May 10, 2026
