మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియన్ ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మే 20న ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఒకరోజు ముందుగానే అంటే మే 19వ తేదీ అర్ధరాత్రి ‘డ్రాగన్’ (#NTRNeel) చిత్రానికి సంబంధించిన మొదటి గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది.
ఈ టీజర్ లాంచ్ కోసం ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ నేషనల్ మీడియా సమక్షంలో ఈ ఫస్ట్ లుక్‌ను ప్రెజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.
సౌత్ సినిమాలకు నార్త్ మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా ప్రమోషన్లను ముంబై నుంచే గ్రాండ్‌గా మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని జూన్ 11, 2027లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
