ఎన్టీఆర్-నీల్ గ్లింప్స్.. రికార్డు లెంగ్త్‌తో ‘డ్రాగన్’ దండయాత్ర..!

JrNTR-Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ అప్పుడే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా సాగుతుండగా ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మేకకర్స్ రెడీ అయ్యారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా మే 20న ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి రాబోతున్న స్పెషల్ గ్లింప్స్ రన్‌టైమ్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా టీజర్లు లేదా గ్లింప్స్ వీడియోలు ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే ఉంటాయి. కానీ ‘డ్రాగన్’ గ్లింప్స్ ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల పాటు ఉండబోతోందని సమాచారం. ఈ ఊహించని రన్‌టైమ్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.

ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఈ స్పెషల్ వీడియో థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను తలపించేలా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎన్టీఆర్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు ఇదొక రేంజ్ విజువల్ ట్రీట్ కానుండటంతో, గ్లోబల్ వైడ్‌గా ఈ ప్రాజెక్ట్ చుట్టూ అప్పుడే మాస్ హైప్ క్రియేట్ అయింది.

Exit mobile version