తమిళ స్టార్ నటుడు సూర్య అభిమానులు ఎంతో కాలంగా కోరుకుంటున్న అవైటెడ్ కంబ్యాక్ ఫైనల్ గా తాజా చిత్రం ‘కరుప్పు’ తో దక్కింది అని చెప్పాలి. దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఫాంటసీ యాక్షన్ చిత్రం అటు తమిళ్ తో పాటుగా తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లు రాబడుతుంది. అయితే ఈ సినిమా ఖాతాలో ఇపుడు మరో రేర్ ఫీట్ యాడ్ అయ్యింది.
మొదటి వారాంతం వసూళ్లు ఏ సినిమాకి అయినా కీలకం అందులోని ఓ స్టార్ నటుడు సినిమా అంటే ఓపెనింగ్ డే వసూళ్లు అధికంగా వస్తాయి. కానీ ఇప్పుడు కరుప్పు/వీర భద్రుడు చిత్రం రేర్ ఫీట్ సెట్ చేసింది. ఓపెనింగ్ డే కంటే వర్కింగ్ డే సోమవారం పెర్ఫామెన్స్ అధికంగా ఉండడం అనేది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దీన్ని స్వయంగా నిర్మాత కన్ఫర్మ్ చేయడం గమనార్హం. సో కరుప్పు చిత్రం మేనియా ఇప్పుడప్పుడే ఆగదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
#Karuppu 🔥
Day4 > Day1#JustGodThings
— SR Prabu (@prabhu_sr) May 19, 2026
