‘ఎల్లమ్మ’ ఓకే చెయ్యడానికి బలమైన కారణం రివీల్ చేసిన దేవిశ్రీ ప్రసాద్!

మన టాలీవుడ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సంగీతం అందిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్క సంగీత దర్శకునిగానే కాకుండా సినిమా హీరోగా కూడా తాను ఇప్పుడు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. బలగం దర్శకుడు వేణు యెల్దండితో చేస్తున్న విలేజ్, డివోషనల్ డ్రామా ‘ఎల్లమ్మ’ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నారు.

అయితే అనేక డిస్కషన్స్ తో హీరోగా మారాలని డిసైడ్ అయ్యిన దేవిశ్రీ ప్రసాద్ అసలు ఎల్లమ్మ అనే సినిమా ఎందుకు ఓకే చేశారు అనేది బలమైన కారణం ఇప్పుడు రివీల్ చేశారు. తన తండ్రి సత్యమూర్తి పుట్టిన ఊరు వెదురుపాక అక్కడి మూలాలు, సంస్కృతులు కారణంగానే ఎల్లమ్మ అనే సినిమాకి ఎస్ చెప్పడానికి ప్రధాన కారణం అని రివీల్ చేశారు.

ఇక దీనిపై రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ కూడా ఇప్పుడు అదిరింది. ఇక ఈ సాలిడ్ సబ్జెక్టులో తాను హీరోగా నటిస్తుండడమే కాకుండా సంగీతం కూడా అందిస్తున్నారు. అలాగే దిల్ రాజు ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version