యూకే మార్కెట్ లో ‘పెద్ది’కి సాలిడ్ రెస్పాన్స్!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రమే పెద్ది. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చేసుకుంది. అయితే ఇంట్రెస్టింగ్ గా యూఎస్ మార్కెట్ కి ధీటుగా యూకే మార్కెట్ లో పెద్ది సినిమా బుకింగ్స్ సాలిడ్ గా స్టడీ గా కొనసాగుతూ ఉండడం విశేషం.

యునైటెడ్ కింగ్డమ్ లో పెద్ది లేటెస్ట్ గా 12వేల 500 కి పైగా టికెట్ సేల్స్ జరుపుకుని విడుదలకి ముందు భారీ రెస్పాన్స్ నమోదు చేసింది. దీనితో అక్కడ ఈ సినిమాకి గట్టి ఓపెనింగ్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా గ్రాండ్ గా జూన్ 4న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది.

Exit mobile version