‘అగధ’ ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్

సీనియర్ దర్శకుడు ఎమ్.ఎస్. రాజు దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘అగాధ’. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ తాజాగా ట్రైలర్ లాంచ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 3న మధ్యాహ్నం 12 గంటలకు ‘అగధ’ ఆఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. సినిమాలోని ఆధ్యాత్మిక, మిస్టరీ అంశాలను మరింత స్పష్టంగా ప్రతిబింబించేలా ఈ ట్రైలర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్రైలర్ ద్వారా చిత్ర నేపథ్యంపై ప్రేక్షకులకు మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియనున్నాయి.

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై కాశీ విశాలాక్షి బాలుసు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించగా, అజయ్ కేఆర్ సమర్పిస్తున్నారు. కామాక్షి భాస్కర్లతో పాటు శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు, రోషన్ మరియు శ్రేయా రాణి రెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు.

పాన్-ఇండియా రేంజ్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Exit mobile version