సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ గా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’ కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా పూర్తవుతూ కొనసాగుతుంది. భారీ సెట్టింగ్స్ అలాగే వి ఎఫ్ ఎక్స్ స్టూడియోస్ సహా రియల్ లొకేషన్స్ లో కూడా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.
దీని ప్రకారం ఒక లాంగ్ యాక్షన్ షెడ్యూల్ లోకి మేకర్స్ దిగినట్టు లేటెస్ట్ అప్డేట్. దాదాపు ఒక నెల పాటుగా నాన్ స్టాప్ గా ఈ యాక్షన్ షూట్ జరగనున్నట్టు తెలుస్తుంది. సో ఈ ఒక్క నెల మొత్తం బాబు యాక్షన్ మోడ్ లో ఉంటాడని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా కే ఎల్ నారాయణ, ఎస్ ఎస్ కార్తికేయ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ వరల్డ్ లెవెల్లో ఈ సినిమా గ్రాండ్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది.
