సమీక్ష: ‘లెనిన్’ –  మెప్పించే విలేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా

విడుదల తేదీ : జూలై 10, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్, శివాజీ, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు, శత్రు తదితరులు
దర్శకత్వం : మురళీ కిషోర్ అబ్బూరు
నిర్మాతలు : నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
సంగీతం : థమన్ ఎస్
ఛాయాగ్రహణం : లియోన్ బ్రిట్టో
కూర్పు : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో అవైటెడ్ గా ఆడియెన్స్ ఎక్కువ ఎదురు చూసిన సినిమా మాత్రం అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమా లెనిన్ అనే చెప్పొచ్చు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

2001 సమయంలో కర్నూల్ జైలు నుంచి అనుకున్న దానికంటే ముందే విడుదల అయ్యిన ఖైదీ లెనిన్ (అఖిల్ అక్కినేని) తన ఊరు శ్రీ రామాపురం వెళ్తాడు. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భారతి (భాగ్యశ్రీ బోర్సే) తనకి గతంలో జరిగిన విషాదం ఏంటి? అసలు తను జైలుకి ఎందుకు వెళ్ళాడు? ఎవరెవరి వల్ల తన జీవితంలో తీరని నష్టం జరిగింది? ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితుడు వసంత్ (ప్రమోద్ పంజు) ఏం చేశాడు? చివరికి లెనిన్ తన పగ తీర్చుకున్నాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకి అప్పటివరకూ ఉన్న బజ్ వేరు ట్రైలర్ కట్ తర్వాత జెనరేట్ అయ్యిన బజ్ వేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటికే పలు వాయిదాలు లెనిన్ విషయంలో కొంచెం నిరాశ కలిగించాయి కానీ మహా భారతం రిఫరెన్స్ తో వచ్చిన ట్రైలర్ కట్ అందరిలో మంచి ఆసక్తి రేకెత్తించింది. ఇదే ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రెజెంట్ చేస్తూ సినిమాలో కూడా అనేక అంశాలు ఆడియెన్స్ ని మెప్పిస్తాయి.

దర్శకుడు ప్లాన్ చేసుకున్న కథనం ఇందులో మంచి బలంగా నిలుస్తుంది. ముఖ్యంగా సెకాండఫ్ ని తీసుకెళ్లిన తీరు ఇందులో మెప్పిస్తుంది. కథనం, పాత్రలు వాటిలో లేయర్స్ ఎంగేజింగ్ గా అనిపిస్తాయి. దాదాపు సినిమాలో కనిపించిన ప్రతీ పాత్ర సినిమాకి బలాన్ని చేకూర్చింది.

ఇక నటీనటులు పెర్ఫామెన్స్ లలో అఖిల్ కోసమే ముందు చెప్పుకోవాలి. అఖిల్ నుంచి డెఫినెట్ గా ఈ రేంజ్ పెర్ఫామెన్స్ ని చాలా మంది ఊహించి కూడా ఉండకపోవచ్చు. తను లెనిన్ గా ఆ రేంజ్ లో లీనం అయ్యిపోయాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో తన ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తన లోని నటుణ్ని తన పోటెన్షియల్ ని చూపించింది.

ఇక భాగ్యశ్రీ కూడా చాలా బాగా చేసింది. అందంగా కనిపిస్తూనే సినిమాకి కావాల్సిన వెయిట్ ని ఆమె క్యారీ చేస్తూ తన పాత్రని రక్తి కట్టించింది. ఇక మరో సర్ప్రైజింగ్ అంశం మాత్రం అఖిల్ కి స్నేహితునిగా సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించిన ప్రమోద్ పంజు (సలార్ ఫేమ్) డెఫినెట్ గా సర్ప్రైజ్ చేస్తాడు. తన పాత్రలోని లేయర్స్ ని ఒకొక్కటిగా చూపిస్తూ సాలిడ్ పెర్ఫామెన్స్ తను చేసాడు.

వీరితో పాటుగా శివాజీకి కూడా సాలిడ్ రోల్ దక్కింది. తను ఈశ్వరి రావు, బ్రహ్మాజీ, శత్రు తదితరులు సినిమాలో బాగా చేశారు. అలానే కొన్ని ట్విస్ట్ లు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఒకింత రొటీన్ గా అనిపిస్తాయి. నేరుగా మహా భారతం రిఫరెన్స్ లతోనే ప్లాన్ చేసుకోవడం మూలాన ఇది కొంతమందికి వర్కవుట్ కావచ్చు కానీ మిగతా ఆడియెన్స్ కి మాత్రం అంత ఫ్రెష్ నెస్ ఉన్నట్టు అనిపించదు.

అలానే ఇది వరకు వచ్చిన కొన్ని రూరల్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు కూడా ఇందులో గుర్తొస్తాయి. వీటి అన్నిటి కంటే క్లైమాక్స్ పోర్షన్ లో అఖిల్ మీద రివీల్ అయ్యే కీలక ట్విస్ట్, దానికి అనుగుణంగా డిజైన్ చేసుకున్న సీక్వెన్స్ ని ఇంక బలంగా ప్లాన్ చేసుకోవాల్సింది. ఇక్కడ కొంచెం లాజిక్ మిస్ చేశారు అనుకోవాలి.

అలానే అఖిల్ రోల్ ఎందుకు జైలుకి వెళ్ళింది అనేది కూడా అంత క్లియర్ గా లేదు. ఇంకా సినిమాలో పాటలు బాగానే ఉన్నాయి కానీ ఈ ఫ్లోలో కొన్ని అనవసరం అనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమా టెక్నికల్ గా చాలా బలంగా కనిపిస్తుంది. భారీ సెట్టింగ్స్ నడుమ ఈ సినిమాని తీసినప్పటికీ ఎక్కడా ఇది సెట్స్ లో తీసిన సినిమాలా అనిపించలేదు. చాలా నాచురల్ గా మంచి కెమెరా వర్క్ తో సాలిడ్ రూరల్ అండ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కించారు. థమన్ ఇచ్చిన స్కోర్ విన్నట్టే ఉంది కానీ పాటలు బాగున్నాయి. లియోన్ బ్రిట్టో కెమెరా వర్క్ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. ఒకటీ రెండు పాటలు విషయంలో కఠినంగా ఉన్నా ఫర్వాలేదు.

ఇక దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు విషయానికి వస్తే.. తన సబ్జెక్ట్ పరంగా తనకి ఉన్న క్లియర్ విజన్ ని నీట్ గా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తను పాత్రలు తీర్చిదిద్ది, ప్రెజెంట్ చేసిన విధానం అందులో పలు ఎంగేజింగ్ అంశాలు ఇంప్రెస్ చేసాయి. కొన్ని అంశాలు రొటీన్ కావచ్చు కానీ ఓవరాల్ గా తన వర్క్ ఇంప్రెస్ చేస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ‘లెనిన్’ తో మనోడు వచ్చి కొట్టేసాడు అని చెప్పడంలో డౌట్ లేదు. అఖిల్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్, దర్శకుడు విజన్ తెరకెక్కించిన తీరు, ఎమోషన్స్ ఇందులో హైలైట్ గా నిలిచాయి. ఇతర నటీనటులు సహకారం కూడా లెనిన్ లో బాగుంది. కాకపోతే కొన్ని సింపుల్ గా అనిపించే ఎలిమెంట్స్ పక్కన పెడితే ఈ లెనిన్ థియేటర్స్ లో మెప్పిస్తాడు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version