పలుమార్లు వాయిదా పడిన రాకింగ్ స్టార్ యష్ లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా ఒక క్రేజీ మైల్‌స్టోన్‌ను అందుకుంది.
ప్రముఖ ప్లాట్‌ఫామ్ IMDb ప్రకారం, ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాలో ‘టాక్సిక్’ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇటీవల విడుదలైన ‘లేడీస్ & లేడీస్’ టీజర్, ‘తబాహి’ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
