యూఎస్ మార్కెట్ లో ‘చెన్నై లవ్ స్టోరీ’ హాఫ్ మిలియన్ మైల్ స్టోన్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా దర్శకుడు రవి నంబూరి తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రమే ‘చెన్నై లవ్ స్టోరీ’. డీసెంట్ బజ్ నడుమ విడుదల అయ్యిన ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతుంది. అయితే ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా మంచి వసూళ్లతో నిలకడగా పెర్ఫామ్ చేయడం విశేషం.

ఇలా సినిమా లేటెస్ట్ గా హాఫ్ మిలియన్ మార్క్ మైల్ స్టోన్ ని చేరుకొని అదరగొట్టింది. ఇలా వీక్ డేస్ లో కూడా డీసెంట్ పెర్ఫామెన్స్ తో చెన్నై లవ్ స్టోరీ వెళ్లడం మంచి విషయం. ఫైనల్ గా ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించగా నేషనల్ అవార్డు విన్నర్ సాయి రాజేష్ కథ, కథనం. నిర్మాణం కూడా అందించారు. అలాగే తనతో పాటుగా 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న మరో నిర్మాత ఎస్ కే ఎన్ కూడా నిర్మాణం వహించారు.

Exit mobile version