సూర్య నుంచి ట్రిపుల్ ట్రీట్.. 2026 లోనే మూడో సినిమా కూడా రిలీజ్!?

కొన్నాళ్ల కితం వరకు థియేట్రికల్ గా సాలిడ్ హిట్ ని కోరుకున్న స్టార్ హీరోస్ లో సూర్య కూడా ఒకరు. తన చిత్రాలు రెండు ఓటిటిలో సక్సెస్ అయ్యాయి కానీ థియేట్రికల్ గా తీసిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అయితే ఈ 2026 మాత్రం సూర్యకి లక్కీ సంవత్సరం అని చెప్పాల్సిందే.

తనకి సరైన హిట్ లేదు అనుకుంటే ఈ ఏడాదిలో కోలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా మాత్రమే కాకుండా భారీ లాభాలు అందించిన సినిమాగా ‘కరుప్పు’తో నిలిచాడు. ఇక ఈ సినిమా ట్రీట్ తర్వాత సూర్య నుంచి ఇదే ఏడాదిలో రెండో సినిమా విడుదల కానుంది.

తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ఈ ఆగస్టులో విడుదల కానుండగా ఇప్పుడు క్రేజీ బజ్ ఏంటంటే ఈ ఏడాదిలోనే తన నుంచి మూడో సినిమా కూడా విడుదల కానున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తో సూర్య కెరీర్ 47వ సినిమాగా చేశారు. ఈ సినిమాని ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్టు ఫ్రెష్ బజ్ వినిపిస్తుంది. సో ఈ ఏడాది మాత్రం సూర్య ఫ్యాన్స్ కి ట్రిపుల్ ట్రీట్ రాబోతుంది అని చెప్పవచ్చు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందట.

Exit mobile version